Kidney Scam | సంచలనం సృష్టించిన కిడ్నీ రాకేట్ కేసులో 5గురిపై కేసు నమోదు
Kidney rocket | విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసులు 5గురిపై కేసు నమోదు చేశారు.
అమరావతి : విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ (Kidney rocket) వ్యవహారంలో పోలీసులు 5గురిపై కేసు (Police case) నమోదు చేశారు. బాషా, వెంకట్, సుబ్రహ్మణ్యంతో పాటు డాక్టర్ శరత్‌బాబు, కిడ్నీ స్వీకర్త వెంకటేశంపై కేసు నమోదు చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కిడ్నీ దానం(Kidney donate) చేస్తే రూ. 30 లక్షలు ఇస్తామని కొందరు ఆశచూపి గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబును మోసం చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మధుబాబు (Madubabu) అనే యువకుడిని విజయవాడకు చెందిన బాషా అనే వ్యక్తి సోషల్‌మీడియాలో పరిచయమయ్యాడు. మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న బాషా.. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు.
30 లక్షల డబ్బు వస్తే తన సమస్యలు అన్నీ తీరుతాయని ఆశపడిన మధుబాబు కిడ్నీ విక్రయానికి ఒప్పుకున్నాడు. దీంతో ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని విజయ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నారు. ఆపరేషన్ తర్వాత మధు బాబుకు 30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ. 1.10 లక్షలు మాత్రమే బాషా ఇచ్చాడు.
మిగిలిన డబ్బులు అడిగేసరికి బాషా తన నిజస్వరూపం బయటపెట్టాడు. స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్లు సంతకం చేశావని మధుబాబుకు తెలిపాడు. కాబట్టి నీకు మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్ శరత్‌బాబు (Dr. Sarathbabu ) , మధ్యవర్తి బాషాపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేయగా పోలీసులు విచారణ జరిపి ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

