వివేకా హత్యపై జగన్ వ్యాఖ్యలు బాధించాయి : సునీతారెడ్డి
ys sunitha reddy| మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై వివేకా కూతురు సునీతారెడ్డి వాంగ్మూలంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రతిపక్షంలో
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై వివేకా కూతురు సునీతారెడ్డి వాంగ్మూలంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ చిన్నాన్నవివేకా హత్యను రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసని ఆమె అన్నారు. నాన్న హత్యపై భారతి, జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నారని, ఈ హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు.
హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెబితే ‘వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో’ అని అన్యాయంగా మాట్లాడారని వెల్లడించారు. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‌కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడు . ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందని అన్నారని’ ఆమె వివరించారు. సీబీఐ విచారణ కోసం తాను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల అన్నారని సునీతా రెడ్డి గుర్తు చేశారు. అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్లో హత్య సమయంలో ఆధారాలను మాయం చేశారని పేర్కొన్నారు.
అవినాశ్‌రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని తన వాంగ్మూలంలో వివరించారు. నా తండ్రి వివేకా అంటే ఎంపీ అవినాశ్‌కు గిట్టదని, హంతకులకు శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానని ఆమె వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

