YS Jagan | ఏపీ హక్కుల కోసం పోరాడండి.. వైఎస్సార్ సీపీలతో ఎంపీ వైఎస్ జగన్
YS Jagan | ఏపీలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంతో పాటు ఏపీ హక్కులు సాధన కోసం పార్లమెంట్లో పోరాడాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎంపీలకు సూచించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కానున్న విషయం తెలిసిందే. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
YS Jagan | ఏపీలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంతో పాటు ఏపీ హక్కులు సాధన కోసం పార్లమెంట్లో పోరాడాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎంపీలకు సూచించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కానున్న విషయం తెలిసిందే. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తుపాను నష్టంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఈ అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పారు. మొంథా తుపాను కారణంగా కోస్తా జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయని.. సర్వం కోల్పోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలమయ్యాయన్నారు.
గతంలో తమ ప్రభుత్వం ఆర్కేబీల ద్వారా నేరుగా పంటలను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించిందని.. ప్రస్తుతం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో రైతులు దళాతుల చేతుల్లో నలిగిపోతున్నారన్నారు. వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చి, మామిడి తదితర ప్రధాన పంటలకు మద్దతు ధర పడిపోయిందని.. దాంతో రైతులు అప్పుల ఊభిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జగన్ ఈ అంశంపై పార్లమెంట్లో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ప్రీమియం భారం లేకుండా ఉచిత పంటల బీమా అందించామని.. ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేయడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్ విమర్శించారు.
ఇన్పుట్ సబ్సిడీ కూడా అందడం లేదని, ఈ-క్రాప్ నమోదును నిలిపివేయడంతో పరిహారం పొందేందుకు రైతులు అనర్హులుగా మారుతున్నారన్నారు. మిర్చి రైతులకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి మోసం చేశారని, మామిడి రైతులను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 18.63 లక్షలతో సహా మొత్తం లక్షల ఉపాధిహామీ జాబ్ కార్డులను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నాయని.. అర్హుల కార్డులను పునరుద్ధరించి, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేయాలని ఎంపీలకు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాజకీయ కక్ష్య సాధింపులు పెరిగాయని, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఉపాధి కల్పన, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

