అమరావతి : ఏపీలో జరుగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల మధ్య కుదిరిన పొత్తుల ఒప్పందంపై మాజీ మంత్రి హరిరామజోగయ్య(Hariramazogaiah) పవన్‌కల్యాణ్(Pawan Kalyan)కు ఘాటుగా లేఖ (Letter) రాశారు. టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలను చంద్రబాబు కేటాయించారు. ఇంత తక్కువ సీట్ల పంపకంపై ఆయన స్పందిస్తూ ఏపీలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇది పొత్తు ధర్మం అనిపించుకుంటుందా. ఏ ప్రాతిపదికన పంపకాలు జరిగాయంటూ లేఖలో ప్రశ్నించారు.
‘ జనసేన (Janasena) సైనికులకు కావలసింది ఎమ్మెల్యేసీట్లు కాదు. చెరో రెండేళ్లు సీఎం.. సగం మంత్రి పదవులు పంచుకోవాలని ఆయన మొదటి నుంచి సూచిస్తున్నారు. ఒకరు ఇవ్వడం మరోకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ నిలదీసారు. జనసేన కు 24 సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా అంటూ మండి పడ్డారు. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. అన్నికులాల జనాభా ప్రాతిపధికన జరిగాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్లు పంపకం ఉందా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సంక్షోభానికి ఒకటే మాత్ర అని జోగయ్య పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ చెరో రెండున్నారేళ్లు సీఎం పదవి.. రెండు పార్టీల నుంచి మంత్రి పదవుల పైన సమాన వాటా ఉండాలని సూచించారు.