అమరావతి : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అగ్నిపథ్ విధ్వంసాలకు కారకుడని భావిస్తున్న అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు కార్యాలయంలో కేంద్ర ఇంటెలిజెన్స్, ఐటీ అధికారులు సోదాలు జరిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీలో ఐబీ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో దస్త్రాల పరిశీలనతో పాటు సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.
శిక్షణ పొందుతున్న యువకులు, ఫీజుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే అతడిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు డిఫెన్స్ అకాడమీకి తీసుకెళ్లి వివరాలు సేకరించారు.