శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి
Ready|విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై రెండు సంవత్సరాల తరువాత పూర్తిస్థాయి దసరా ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై రెండు సంవత్సరాల తరువాత పూర్తిస్థాయి దసరా ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల తొలిరోజు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మూల నక్షత్రం రోజున ఏపీ సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు పదిరోజుల పాటు జరిగే ఉత్సవాలకు 14 లక్షల మంది భక్తులు రావొచ్చని భావిస్తున్నారు. రోజుకు 60వేల మంది భక్తులు రావొచ్చని అంచనావేస్తున్నారు.
ముఖ్యంగా అక్టోబర్ 2వ తేదీన మూలా నక్షతం రోజున రెండు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం ఉండడం తో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆన్లైన్లో రూ. 100, రూ.300 ల టిక్కెట్లను, వీఐపీలకు రూ.500 ల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆలయానికి సమీపంలోని కృష్ణా నది ఉదృతంగా ఉండడంతో నదిలో భక్తులు దిగకుండా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు.
సీతమ్మవారి పాదాల నుంచి దోబీఘాట్ వరకు 500, పున్నమి ఘాట్లో రెండు వందలు, భవానీ ఘాట్లో వంద కలిపి మొత్తం 800 జల్లు స్నానాలు ఏర్పాట్లు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు గాను రెండువందల మంది క్షురకులను ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలకు 20లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఇందుకుగాను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

