AP Elections | ఏపీలో పొత్తులపై కొలిక్కిరాని చర్చలు.. సీట్ల సంఖ్యపై మల్లగుల్లలు
AP Elections | ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడుపార్టీల మధ్య సీట్ల సంఖ్యపై చర్చలు కొనసాగుతున్నాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడుపార్టీల మధ్య సీట్ల సంఖ్యపై చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నిన్న రాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా (Nadda) , కేంద్ర మంత్రి అమిత్ షా (Union minister Amit Shah) తో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో శుక్రవారం మరోసారి కలవాలని నిర్ణయించుకున్నారు.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేనల మధ్య సీట్ల 118 చోట్ల సీట్ల పంపకం పూర్తయింది. వీటిలో టీడీపీ 94 స్థానాలు దక్కించుకోగా జనసేన 24 స్థానాల్లో పోటికి అంగీకారం కుదిరింది. టీడీపీ 12 ఎంపీ స్థానాలు, జనసేన మూడు స్థానాల్లో పోటికి ఒప్పందం జరిగింది. మిగిలిన 10 స్థానాలను రిజర్వ్ చేసుకున్నారు.
నిన్న జరిగిన చర్చల్లో బీజేపీ 6 పార్లమెంట్ , 15 అసెంబ్లీ స్థానాలను కోరుతుండగా 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ సీట్లు్ ఇస్తామని టీడీపీ, జనసేన నేతలు సూచించారు. వీటిపై పీఠముడి పడడంతో శుక్రవారం మరోసారి చర్చలు జరుగనున్నాయి. అమిత్ షా పార్టీ కార్యక్రమంలో బిజీ ఉండడంతో ఈరోజు రాత్రి చర్చలు జరిగే అవకాశముందని సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

