ఒక్క ఓటుతో గెలిచింది ఒకరు..! కేవలం ఒక్క ఓటు మాత్రమే సాధించింది మరొకరు.. మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు
AP News | ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్(Muncipal elections) ప్రక్రియలో పలు విచిత్రాలు చోటు చేసుకున్నాయి.
AP News | ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్(Muncipal elections) ప్రక్రియలో పలు విచిత్రాలు చోటు చేసుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితం వెలువడింది. పట్టణంలోని 1వ వార్డులో వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ కేవలం ఒక్క ఓటు తేడాతో గెలువగా అనకామపల్లి జిల్లా యలమంచిలిలోని 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మళ్ల రామకృష్ణకు ఒకే ఒక్క ఓటు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చే సింది. రామకృష్ణ ఏసీ గుర్తుతో పోటీ చేశారు. కాగా అతనికి వచ్చిన ఓటు అతను వేసుకున్నదా? లేక వేరెవరైనా వేశారా అన్నది చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా అభ్యర్థి కుటుంబసభ్యులు, బంధువులైనా కనీసం అతనికి ఓట్లు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వార్డులో నోటాకు 6, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 6, చెల్లని ఓట్లు 21గా లెక్కతేలాయి. 13వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కోన వరలక్ష్మికి 8 ఓట్లు మాత్రమే పడ్డాయి. 18వ వార్డులో స్వతంత్ర అభ్యర్థికి 13 ఓట్లు, 21వ వార్డులో స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు వచ్చాయి. పోటీ చేసిన అభ్యర్థికి ఒక్క ఓటు మాత్రమే రావడం ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

