Janasena | ఏపీలో జనసేన కీలక నిర్ణయం.. కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ
Janasena | ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నాయకుల మధ్య పెరుగుతున్న అంతరాలను తగ్గించేందుకు ఇరు పార్టీలు సమాయత్తమయ్యాయి. డిప్యూటీ సీఎం అంశంపై స్పందించవద్దని జనసేన కీలక ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నాయకుల మధ్య పెరుగుతున్న అంతరాలను తగ్గించేందుకు ఇరు పార్టీలు సమాయత్తమయ్యాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం (Deputy CM) అంశంపై ఎవరూ స్పందించవద్దని తాజాగా జనసేన (Janasena) కేంద్ర కార్యాలయం నాయకులకు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మీడియా ముందుగాని, సోషల్ మీడియాలో గాని స్పందించవద్దని సూచించింది.
ఇప్పటికే కూటమిలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు (Pawankalyan) డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక మంత్రిత్వశాఖలను కేటాయించింది. పవన్‌తో పాటు మరొ ముగ్గురికి మంత్రిగా అవకాశాలు దక్కాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తుంది.
అయితే ఇటీవల ముఖ్యమంత్రి తనయుడు , మంత్రి నారా లోకేష్‌కు (Nara Lokesh) డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీ అధిష్టానాన్ని కోరారు. దావోస్‌లో జరుగుతున్న పారిశ్రామిక పెట్టుబడుల సదస్సులోనూ మంత్రి టీజీ భరత్ మంత్రి లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు ఎదుటే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సదస్సు పూర్తయిన తరువాత చంద్రబాబు మంత్రి భరత్‌కు క్లాస్ తీసుకున్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలని గట్టిగానే హెచ్చరించారు.
ఇదిలా ఉండగా తమ నాయకులు పోటాపోటీగా చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు టీడీపీ, జనసేన అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయి. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ కూడా బహిరంగంగా మాట్లాడవద్దని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పార్టీకి చెందిన నాయకులకు సమాచారం పంపారు. మంగళవారం ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయం డిప్యూటీ సీఎం అంశంపై స్పందించవద్దని నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

