Srisailam | మకర సంక్రాంతి.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం (Srisailam) శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కనుమ పండుగ నేపథ్యంలో దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
శ్రీశైలం: శ్రీశైలం (Srisailam) శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కనుమ పండుగ నేపథ్యంలో దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి పుణ్యదంపతుల దర్శనం కోసం క్యూలైన్ల, కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నది.
భక్తులు భారీగా తరలిరావడంతో అధికారులు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలిపివేశారు. అదేవిధంగా రద్దీ దృష్ట్యా భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మల్లికార్జునుడిని దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

