ఏలూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ | ఏలూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల ప్రకటనకు గురువారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపునకు అనుమతించింది.

అమరావతి : ఏలూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల ప్రకటనకు గురువారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపునకు అనుమతించింది.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని ఎన్నికలు వాయిదా వేయాలని మార్చి 8న దాఖలైన పిటిషన్‌పై ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ విషయమై ఏపీ సర్కార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపి ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఎన్నికల ఫలితాలను మాత్రం వెల్లడించవద్దని మార్చి 9న ఆదేశించింది. ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లున్నాయి. వీటిలో 3 స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకొంది.
47 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఏలూరు కార్పొరేషన్లో ఫలితం ఎలా ఉంటుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

