Hari Ramajogaiah | నా సలహాలు నచ్చకపోవడం వాళ్ల ఖర్మ : హరి రామజోగయ్య లేఖ
Hari Ramajogaiah | ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జనసేన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీడీపీతో జత కట్టడం, సీట్ల పంపకంలో అన్యాయంపై కాపు సంఘం నాయకుడు, మాజీ మంత్రి హరి రామజోగయ్య గురువారం మరో లేఖను సంధించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జనసేన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీడీపీతో జత కట్టడం, సీట్ల పంపకంలో అన్యాయంపై కాపు సంఘం నాయకుడు, మాజీ మంత్రి హరి రామజోగయ్య (Hari Ramajogaiah) గురువారం మరో లేఖను సంధించారు. టీడీపీ, జనసేన బాగు కోరి తాను ఇచ్చిన సలహాలు(Advise) చంద్రబాబుకు, పవన్‌కు నచ్చినట్లు లేదని, తన సలహాలు నచ్చకపోవడం వాళ్ల ఖర్మ, ఇక తాను చేసేదేమీ లేదని ఘాటుగానే లేఖలో పేర్కొన్నారు.
నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో రెండు పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలోనూ పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారని, నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించొద్దు. విదేశాల్లో కూర్చుని, టీవీల్లో కూర్చుని ప్రశ్నించడం కాదని, తనకు ఎవరి సలహాలు అక్కర్లేదంటూ ఆవేశంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై నొచ్చుకున్న హరి రామజోగయ్య గురువారం లేఖ రాశారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి జనసేన నాయకుడు పవన్ కల్యాణ్(Pawan kalyan)కు హరి రామజోగయ్య లేఖలు రాస్తూ చంద్రబాబుతో జాగ్రత్తగా రాజకీయాలు డీల్ చేయాలని అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపకంలో బడుగు, బలహీవవర్గాలకు అన్యాయం జరిగిందంటూ హరి రామజోగయ్య లేఖను రాశారు.
బడుగు, బలహీన వర్గాల ఆశిస్తున్న ప్రకారం వారి సంతృప్తి మేరకు అధికారం పంచుకోవడంలో పవన్‌కల్యాణ్, చంద్రబాబు పాత్ర ఏమిటో తెలియకుండా ముందుకు వెళ్లటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలని, పవన్ కల్యాణ్ గౌరవప్రదమైన పదవిని దక్కించుకోవాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో ఈనెల 29న తానే వ్యక్తిగతంగా స్పందించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
Honey Trap | యువతిగా నటిస్తూ యువకులతో పరిచయం పెంచుకుని..
Horoscope | 20-10-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

