అమరావతి : కాపు సంక్షేమ సేన నాయకుడు, మాజీ మంత్రి హరి రామజోగయ్య (Hari Ramajogaiah) వరుసగా మూడోరోజు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కు శుక్రవారం మరో లేఖ (Letter) రాశారు. జనసేన బాగు గూర్చి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించి తాను ఇచ్చే సలహాలు ఆయనకు నచ్చినట్టు లేవని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ లేకుండా టీడీపీ నెగ్గటం అసాధ్యమని జోస్యం చెప్పారు.
వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడ్డ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు తర్వాతనైనా ‘ మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని, ముఖ్యమంత్రి పదవి(Chief Minister Post) చేపట్టటంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్మడం లేదని తెలిపారు. ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడనే భయం జనసైనికుల్లో ఉందని వెల్లడించారు.
ఎన్నికలు ముందే మీకు అధికారంలో రావటంతో పాటు, మీ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున నేను డిమాండు చేయటంలో తప్పేమిటి? ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలపై మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకుని ప్రవర్తించటం శ్రేయస్కారమని సూచించారు. మీకు యిష్టమైనా, యిష్టం లేకపోయినా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపడుకోవటం నా విధిగా భావిస్తున్నానని లేఖలో స్పష్టం చేశారు.