YS Jagan | జగన్‌కు ప్రభుత్వం భద్రత కల్పించాల్సిందే.. చంద్రబాబు సర్కార్‌కు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Jagan | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తనకు జడ్ ప్లస్ కేటగిరీని కుదించడాన్ని సవాలు చేస్తూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3వ తేదీకి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
YS Jagan | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తనకు జడ్ ప్లస్ కేటగిరీని కుదించడాన్ని సవాలు చేస్తూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3వ తేదీకి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
వైఎస్ జగన్‌కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జగన్‌కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని సూచించింది. జామర్ ఏర్పాటుపై కూడా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. జగన్‌కు జామర్ వెహికల్స్‌ను కూడా కేటాయిస్తామని వివరించింది. మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం భద్రత కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనకు భద్రతను తగ్గించేశారని, ప్రాణహాని ఉన్నందున ఎన్నికల ఫలితాలకు ముందున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు అందించిన భద్రత ప్రాముఖ్యతను జగన్ గుర్తుచేశారు. తన పదవికున్న సున్నితమైన స్వభావం, ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల దృష్ట్యా తనకు భద్రత అత్యంత కీలకమని పేరొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆశ్చర్యకరంగా నెల రోజుల్లోనే తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భద్రతను తగ్గించారని పిటిషన్లో పేరొన్నారు. జడ్ ప్లస్‌గా ఉన్న తన భద్రతను తగ్గించడంతో పాటు భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా భారీగా తగ్గించేశారని ఆరోపించారు. ప్రస్తుతం తనకు అన్ని వేళలా కేవలం ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నారు. గతంలో తనకు 139 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. దాన్ని 59కి కుదించారని, దీన్ని పునరుద్ధరించాలని జగన్ తన పిటిషన్లో కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

