Good News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
Good News | వేసవి సెలవుల కారణంగా తిరుమల (Tirumala) కు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ (TTD) పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల : వేసవి సెలవుల కారణంగా తిరుమల (Tirumala) కు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ (TTD) పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు సైతం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు గాను వచ్చే మూడు నెలలపాటు వీఐపీ బ్రేక్ దర్శనాల (VIP break darshan) ను రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశం హాల్లో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో(Dial Your EO) కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన వేళలు కల్పించడానికి సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాన్ని రద్దు చేసినట్లు వివరించారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, బయట లైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, స్నాక్స్ , వైద్య సదుపాయాలు నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు.
మాడ వీధులు, నారాయణగిరి గార్డెన్స్ వెంబడి కూల్ పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్లు నెలకొల్పుతున్నామని పేర్కొన్నారు. వేసవి రద్దీ సమయంలో భక్తులకు సహాయం అందించేందుకు స్కౌట్స్, గైడ్స్‌తో పాటు 2500 మంది శ్రీవారి సేవకులను నియమించామని తెలిపారు. వేసవి వేడి రోజులలో శేషాచల అటవీ ప్రాంతాల్లో ఫ్లాష్ అగ్ని ప్రమాదాలను నివారించడానికి టీటీడీ అటవీ శాఖ, ప్రభుత్వ అగ్నిమాపక శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

