Srisailam | శ్రీశైలంలో 7న పౌర్ణమి వేడుకలు
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఈవో లవన్న తెలిపారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుండి పౌర్ణమి ఘడియలు ప్రారంభం కావడంతో సాయంత్రం కృష్ణానది వద్ద నదీమ తల్లికి గంగాహరతి కార్యక్రమం చేస్తామని చెప్పారు. ప్రదోషకాల సమయంలో ప్రధానాల గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమం, పుష్కరిణి వద్ద దశవిధ హారతులు, లక్ష దీపార్చన కార్యక్రమాలు జరిపిస్తామని తెలిపారు. పౌర్ణమి రోజు జరిగే ప్రత్యేక కార్యక్రమాలను వీక్షంచేందుకు వస్తున్న యాత్రికులకు తగిన వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

శ్రీశైలంలో అభివృద్ది పనుల పరిశీలన
శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులకు వసతి కల్పనకు చేపట్టిన అభివృద్ది పనుల్లో అలసత్వం వహించవద్దని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మెన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు. ఆదివారం ఉదయం ఈవో లవన్నతో కలిసి ఇంజనీరింగ్ అధికాలతో కలిసి పాతాళగంగ, వలయ రహదారి, పార్కింగ్, శౌచాలయాలు వంటి అత్యవసర మౌలిక వసతులను పరిశీలించారు.

చైర్మన్‌తోపాటు ధర్మకర్తల మండలి సభ్యులు విజయలక్ష్మి సుబ్బరాయుడు నేరుగా భక్తుల క్యూకాంప్లెక్స్లకు వెళ్లి యాత్రికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్తీక మాసాంతం వరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఇటీవల చేపడుతున్న నిర్మాణ పనుల నాణ్యతలో రాజీపడవద్దని భావితరాలకు నిలిచిపోయే విధంగా ఉండాలని గుత్తేదారులకు చెప్పారు.

శైల దేవస్థానానికి మందుల విరాళం
శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులకు ఎమర్జెనీ అవసరాలకు ఉపయోగపడే ఔషధాలను హైదరాబాద్ మేడ్చల్‌జిల్లా మల్కాజిగిరి వాసి పాక శ్రీనివాస్ యాదవ్, చలాది భాస్కర్‌రావు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా వాసి గాయత్రి మిల్క్ డైరీ వ్యవస్థాపకులు పల్లి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబసభ్యులు కలిసి కీ.శే. పల్లి లీలావతమ్మ ఙ్ఞాపకార్థం విరాళంగా ఇచ్చారు. ఆదివారం దేవస్థానం దవాఖానలో ఈవో లవన్న ఆధ్వర్యంలో ఏఈవోలు శ్రీనివాసరెడ్డి, మోహన్, పర్యవేక్షకులు మధుసూదన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, విశ్రాంత ల్యాబ్‌టెక్నీషియన్ రాఘవేంద్రుడు, అపోలో వైద్యులు డాక్టర్ శ్యాంప్రసాద్రెడ్డిలకు ఔషధాలను అందజేశారు. యాత్రికుల ఆరోగ్య భద్రత కోసం ముందుకు వస్తున్న దాతలను ఈవో లవన్న అభినందించారు. అదేవిధంగా దాతలకు స్వామిఅమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక దర్శానాలు కల్పించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ ఔషధాలను యాత్రికుల అవసరాలకు సద్వినియోగపరుచుకోవాలని దాతలు కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

