అమరావతి : ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ( Rajya Sabha members ) కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం ( Unanimous ) గా ఎన్నికయ్యారు. గత వారం రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలో టీడీపీ( TDP ), బీజేపీ ( BJP ), జనసేన ( Janasena ) కూటమిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కాగా నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను మూడు టీడీపీ, ఒకటి జనసేన తీసుకుంది. టీడీపీ మూడులో భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్, జనసేన తరుఫున లింగమనేని రమేష్ రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో నాలుగు స్థానాలకు ఎవరూ కూడా నామినేషన్లు వేయక పోవడంతో టీడీపీ, జనసేన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల సంఘం వెల్లడించింది .