AP High court Judgers | ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు జడ్జిల ప్రమాణస్వీకారం
AP High court Judgers | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా శనివారం ఉదయం నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది. కొత్త న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా శనివారం ఉదయం నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది. కొత్త న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి జగన్, నూతన న్యాయమూర్తుల కుటుంబసభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దాంతో వీరి నియామకానికి కేంద్ర న్యాయశాఖ అక్టోబర్ 18న ఉత్తర్వులిచ్చింది.
ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులకు గానూ ప్రస్తుతం 27 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలతో కలిపి ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

