భార్యతో విభేదాలు.. పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య..
పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో విషాద ఘటన జరిగింది. భార్యతో విభేదాల కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో విషాద ఘటన జరిగింది. భార్యతో విభేదాల కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామశివారులోని గోదావరి నది ఒడ్డున బ్రిడ్జికి సమీపంలో విశ్వనాథం అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు రేపతి (9), జెస్సీక(8)కి పురుగుల మందు తాగించి తానూ తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురికి స్థానికులు గుర్తించి రాజోలు ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. భార్యతో ఉన్న కలహాల కారణంగా విశ్వనాథం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

