తిరుమలలో పర్యావరణహిత సంచులు

విక్రయ కౌంటర్‌ను ప్రారంభించిన టీటీడీ ఈవో, డీఆర్డీవో చైర్మన్
హైదరాబాద్; ఆగస్టు 22 (నమస్తేతెలంగాణ): ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా డీఆర్డీవో రూపకల్పన చేసిన బయోడీగ్రేడబుల్ సంచులను మొదట తిరుమల పుణ్యక్షేత్రంలో అందుబాటులోకి తెచ్చారు. శ్రీవారి భక్తులు లడ్డూ, ప్రసాదాలను తీసుకెళ్లేందుకు వీలుగా ఆదివారం తిరుమలలోని లడ్డూ విక్రయ కేంద్రంలో సంచుల కౌంటర్‌ను టీటీడీ ఈవో జవహర్‌రెడ్డితో కలిసి డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఐదు లడ్డూలు పట్టే సంచి ధర రూ.2, పది లడ్డూలు పట్టే సంచి ధరను రూ.5గా నిర్ణయించారు. పర్యావరణహితమైన ఈ సంచులను జంతువులు తిన్నా ఎలాంటి హాని ఉండదని సతీశ్‌రెడ్డి తెలిపారు. మూడు నెలల్లో భూమిలో కలిసిపోయేలా సంచులను తయారుచేసినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- DRDO
- sathish reddy
- Thirumala
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

