Earthquake | ప్రకాశం జిల్లాలో భూకంపం.. నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి
ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి (Earthquake) కంపించింది. అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో భూప్రకంపణలు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు.
ప్రకాశం: ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి (Earthquake) కంపించింది. అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో భూప్రకంపణలు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు.
గత నెల 6న కూడా ప్రకాశం జిల్లా పొదిలిలో భూకంపం వచ్చింది. ఉదయం 9.54 గంటలకు భూమి కంపించింది. సుమారు 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. కొత్తూరులోని రాజు దవాఖాన వీధి, బ్యాంకు కాలనీ, ఇస్లాంపేటలో ప్రకంపణలు వచ్చాయి. అంతకుముందు రోజు సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3.8 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. గంగాధర, చొప్పదండిలోని వాస గృహాలు, దుకాణ సముదాయాలు, సూపర్మార్కెట్లలో సామానులు కిందపడిపోగా, ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు ఆందోళన చెందారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో భూమి కంపించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

