Srisailam | రేపటి నుండి శ్రీశైలంలో దసరా నవరాత్రులు
Srisailam | ఈవో లవన్న ప్రత్యేక పూజలు చేయడంతో సోమవారం నుంచి శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
Srisailam | భూమండలానికి నాభి స్థానంగా పరిగణించే శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం నుండి దసరా శరన్నవరాత్రుల వేడుకలు శాస్త్రోకంగా ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల వేడుకల నేపథ్యంలో శ్రీశైల ఆలయ ప్రాకారాలన్నీ విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.

ఆలయ కార్యనిర్వాహణాధికారి లవన్న అర్చక వేదపండితులతో కలిసి సోమవారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ప్రధాన గోపురం నుండి ఆలయ ప్రవేశం చేస్తారు.అటుపై గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, దీక్ష సంకల్పం, కంకణ పూజ, ఋత్వికగ్వరణం, అమ్మవారి యాగశాల ప్రవేశం, అఖండదీపస్థాపన, మండపారాధన తదితర పూజలు నిర్వహిస్తారని దేవస్థానం అధికారులు తెలిపారు.

స్వామివారి ఆలయ యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతి పూజ, చండీశ్వర పూజ,వాస్తు పూజ, రుద్రకలశ స్థాపన, స్వామివారికి మహన్యాసపూర్వక రుధ్రాభిషేకం జరగనున్నాయి.


మధ్యాహ్న కాలార్చన, సహస్ర నామార్చన, మహా నివేదన అనంతరం సాయంకాలం జపానుష్టానాలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, నవవార్చన, కుంకుమార్చన, రుద్రహోమం, చండీహోమం జరుగుతాయని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు.

సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకార పూజలు జరిపించి గ్రామోత్సవనంతరం రాత్రి సువాసినీ పూజ, కాళరాత్రిపూజలతో తొలిరోజు నవరాత్రి మహోత్సవం జరుగుతుందని ఈవో లవన్న తెలిపారు.
భ్రామరిగా అమ్మవారు.. భృంగి వాహనంపై ఆది దంపతుల విహారం
సోమవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భృంగి వాహనంపై గ్రామోత్సవంలో విహరించనున్నారు. శైలపుత్రిగా దర్శనమిచ్చే భ్రామరి అమ్మవారిని చూసేందుకు గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
విశేష అలంకారణలు – వాహనసేవలు
తేదీ ———— అమ్మవారి అలంకరణలు —- వాహనసేవలు
26-09-2022 — శైలపుత్రి ———————- భృంగివాహనం
27-09-2022 — బ్రహ్మచారిణి —————– మయూరవాహనం
28-09-2022 — చంద్రఘంట —————- రావణవాహనం
29-09-2022 — కూష్మాండదుర్గ ————— కైలాస వాహనం
30-09-2022 — స్కందమాత —————— శేష వాహనం
01-10-2022 — కాత్యాయని ——————– హంసవాహనం, పుష్పపల్లకిసేవ
02-10-2022 — కాళరాత్రి ———————- గజవాహనం
03-09-2022 — మహాగౌరి ———————- నందివాహనం
04-09-2022 — సిద్దిదాయిని —————— అశ్వవాహనం
05-09-2022 — భ్రమరాంబదేవి ————— నందివాహనం (ఆలయ ఉత్సవం)
(నిజరూపాలంకరణ)
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

