YS Jagan | మనం పోరాటం చేయకపోతే ఈ దారుణాలు ఆగవు.. వైసీపీ ఎంపీలతో వైఎస్ జగన్
YS Jagan | ఏపీలో హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివారం వైసీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది.
YS Jagan | ఏపీలో హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివారం వైసీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన అంశాలపై వైసీపీ లోక్‌సభ, రాజ్యసభకు చెందిన 15 మంది ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో తీవ్ర వైఫల్యం చెందాయని అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వినుకొండలో జరిగిన హత్య ఘటన పరాకాష్ట అని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై పార్లమెంటు సమావేశాల్లో చర్చకు డిమాండ్ చేయాలని వైసీపీ ఎంపీలకు జగన్ సూచించారు. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని సూచనలు చేశారు.
రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చర్చించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్మెంట్లు కోరానని జగన్ తెలిపారు. ఈ నెల 24న ధర్నా చేసే రోజే వారిని కలిసేలా ఏర్పాట్లు చేయాలని ఎంపీలకు సూచించారు. ధర్నాకు కలిసొచ్చే పార్టీలను పిలవాలన్నారు. మన పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపించాలని అన్నారు. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్టపడదని తెలిపారు. రాష్ట్రంలోని హింసాత్మక పరిస్థితులపై అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన తెలుపుతామని చెప్పారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పోరాటాలు చేయకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- chandrababu
- ycp
- ys jagan
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

