శ్రీశైలం : మయూర వాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు

శ్రీశైలం : శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి సింహ మండపం వద్ద బ్రహ్మచారిణీగా దర్శనమిచ్చిన భ్రమరాంబ అమ్మవారికి అర్చనలు చేసినానంతరం అలంకార మండపంలో మయూర వాహనంపై ఆసీనులైన స్వామి అమ్మవార్లకు షోడశోపచార క్రతువులు నిర్వహించి ప్రాకారోత్సవం జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవం తరువాత కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు తీర్థప్రసాద వితరణ ఆదిదంపతులకు ఆస్థానసేవ జరిపించారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ఆలయ ప్రాకారోత్సవంలో కళాకారుల విన్యాసాలు నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. శరన్నవరాత్రుల్లో మూడో రోజు శనివారం సాయంత్రం అమ్మవారు చంద్రఘంట అలంకారంలో దర్శనమివ్వగా స్వామివారు రావణ వాహన సేవలో దర్శనమివ్వనున్నారని ఈఓ లవన్న తెలిపారు.


Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

