Cyclone Ditwah | దిత్వా తుపాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్జ్ జారీ!
Cyclone Ditwah | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ భారత్‌వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతానికి ఇది కారైకల్‌కు 80కి.మీ., పుదుచ్చేరికి 160 కి.మీ., చెన్నైకి 250 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Cyclone Ditwah | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ భారత్‌వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతానికి ఇది కారైకల్‌కు 80కి.మీ., పుదుచ్చేరికి 160 కి.మీ., చెన్నైకి 250 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన ఆరు గంటల్లో 5 కి.మీ. వేగంతో ఈ తుపాన్ కదిలింది. రాగల 24 గంటల్లో ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
దిత్వా తుపాన్ ప్రభావంతో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. రేపు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 80కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

