Cyclone Arnab | తీరం దాటిన అర్నబ్ తుపాను.. తీవ్ర తుపానుగా మరికొన్ని గంటలు..!
Cyclone Arnab | ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న ‘అర్నబ్ తుపాను (Cyclon Arnab)’ తీరం దాటింది. యానాంకు నైరుతి దిశలో నరసాపురానికి సమీపంలో తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరందాటే ప్రక్రియ పూర్తయిందని, అతి తీవ్ర తుపాను తీవ్ర తుపానుగా బలహీనపడటానికి కొన్ని గంటల సమయం పడుతుందని వెల్లడించింది.
Cyclone Arnab : ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న ‘అర్నబ్ తుపాను (Cyclone Arnab)’ తీరం దాటింది. యానాంకు నైరుతి దిశలో నరసాపురానికి సమీపంలో తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరందాటే ప్రక్రియ పూర్తయిందని, అతి తీవ్ర తుపాను తీవ్ర తుపానుగా బలహీనపడటానికి కొన్ని గంటల సమయం పడుతుందని వెల్లడించింది. తుపాను తీరం దాటిన నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తుపాను ప్రభావంతో ఇవాళ మధ్యాహ్నం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొన్నది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుపాను ప్రభావంతో ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల వరకు విశాఖపట్నంలో 216.9 మిల్లీమీటర్లు, కళింగపట్నంలో 147.5 మిల్లీమీటర్లు, తునిలో 123.3 మిల్లీమీటర్లు, కాకినాడలో 118.4 మిల్లీమీటర్లు, మచిలీపట్నంలో 115.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అనకాపల్లిజిల్లా కాశింకోట మండలం కన్నూరిపాలెంలో 24 గంటల్లో సుమారు 263 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు నివేదికలు వెల్లడించాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. బలమైన గాలుల కారణంగా కోనసీమ, కాకినాడ ప్రాంతాల్లో విద్యుత్తు మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది. కోనసీమలో సుమారు 6 వేల విద్యుత్తు స్తంభాలు నేలకూలిపోయాయి. దాంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు, హోర్డింగులు కూలిపోవడంతో కొన్ని రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి.
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో సముద్రపు అలల ఉద్ధృతికి బీచ్ రహదారి దెబ్బతిన్నది. తీర రక్షణకు ఏర్పాటుచేసిన రాళ్లు సైతం అలల ధాటికి కదిలిపోయాయి. యానాంలోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడి పునరావాస కేంద్రంలోకి నీరు చేరడంతో కొందరిని భవనంలోని పైఅంతస్తుకు తరలించారు. తుపాను కారణంగా విమాన, రైలు, రోడ్డు రవాణా సేవలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. పలు విమానాలు రద్దయ్యాయి.
రైళ్ల రాకపోకల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నం జిల్లాలో కొన్ని ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. తుపాను తీరం దాటే ప్రక్రియ పూర్తయ్యేవరకు తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nani and Anjana | ‘బ్లాక్‌బస్టర్’ సంసారానికి 14 ఏళ్లు.. నాని-అంజు జంటకు అభిమానుల శుభాకాంక్షలు!
Cyclone Arnab | తీరం దాటిన అర్నబ్ తుపాను.. తీవ్ర తుపానుగా మరికొన్ని గంటలు..!
TTD | శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్ ఘటన..బాధ్యులపై కేసు నమోదు
Israeli Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. తగ్గనున్న నెతన్యహూ మెజారిటీ !
Medak | మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో మంజీరా నదిలో దూకి తల్లి ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

