.. ఆ వైసీపీ ఎమ్మెల్యే మమ్మల్ని తొక్కి గాయపరిచారు : సీపీఐ(ఎం) నాయకులు
వైసీపీ ఎమ్మెల్యే | ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న తమపై వైసీపీ ఎమ్మెల్యే జులుం ప్రదర్శించారని, తమను తొక్కుకుంటూ వెళ్లడంతో గాయపడ్డామని సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు.

అమరావతి : ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న తమపై వైసీపీ ఎమ్మెల్యే జులుం ప్రదర్శించారని, తమను తొక్కుకుంటూ వెళ్లడంతో గాయపడ్డామని సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను పెంపు, చెత్తపై నూతనంగా పన్ను విధించడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట భైఠాయించి సీపీఐ (ఎం) నాయకులు ఉదయం ఆందోళనకు దిగారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లోకి వెళ్లకుండా స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబును అడ్డుకున్నారు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే రాంబాబు మెట్లపై కూర్చున్న సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్యలో నుంచి మెట్లేక్కి లోపలికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తమపై కాళ్లు పెట్టి తమను గాయపరిచారని పలువురు సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. సీపీఐ (ఎం) నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

