విశాఖ ఆస్తులు రక్షించాలని కార్పొరేటర్ల ఆందోళన..
visaka| విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అప్పుల కోసం ప్రభుత్వ స్థలాలు కుదువపెట్టొద్దని జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద టీడీపీ, జనసేన, సీపీఎం
అమరావతి : విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అప్పుల కోసం ప్రభుత్వ స్థలాలు కుదువపెట్టొద్దని జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద టీడీపీ, జనసేన, సీపీఎం కార్పొరేటర్లు నిరసన తెలిపారు. చెత్త పన్నుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే విశాఖ నగరంలో ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐ, రిషికొండ, రాజీవ్ గృహ కల్ప, రైతుబజార్, తహసీల్ కార్యాలయాలో ఆస్తులను తాకట్టు పెట్టిన ప్రభుత్వం ఇక జీవీఎంసీ ఆస్తులపై కన్నేసిందని విమర్శించారు.
స్వర్ణభారతి స్టేడియం, జీవీఎంసీ కార్యాలయం, పార్కు స్థలాలు కూడా త్వరలో తాకట్టు పెట్టనుందని ఆరోపించారు. జీవీఎంసీకి ఆస్తుల పెంపుదల చేయాల్సిందిపోయి కుదువ పెట్టడం దారుణమని నాయకులు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీపీఎం కార్పొరేటర్ గంగారాం ఏపీ సీఎం జగన్ బొమ్మతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఇప్పటికే ఆస్తులు కుదువపెట్టి నగరంలో రూ.200 కోట్లు అప్పు తీసుకొచ్చారని గంగారాం ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

