Alliance Complaint | ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిపై కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు
Alliance Complaint | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డిపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డి ( AP CS Jawajar Reddy) పై టీడీపీ(TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) నాయకులు కేంద్ర మానవ హక్కుల సంఘానికి (CHRC) ఫిర్యాదు చేశారు. సీఎస్ ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని , పింఛన్ల వ్యవహారంలో సీఎస్‌పై ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు. వాలంటీర్లను పక్కనపెట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో పింఛన్ల పంపిణీకి ఈసీ ఆదేశాలు జారీ చేయగా సీఎస్ దానిని పట్టించుకోలేదని ఆరోపించారు.
సీఎస్ వైఖరితో 33 మంది మరణించారని వెల్లడించారు. కదల్లేని వారినీ సచివాలయాలకు రావాలని అధికార వైసీపీ ప్రచారం చేసిందని విమర్శించారు. ఇంటి వద్దే పింఛన్లు అందించేలా ఆదేశించాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు అందేలా చూడాలని విన్నవించారు. వైసీపీ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్న సీఎస్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛన్ల (Pensions) నిధులు సమకూర్చడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

