నాగార్జున యూనివర్శిటీ స్నాతకోత్సవం.. సీజేఐ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 37, 38 స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం...
గుంటూరు జిల్లా : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 37, 38 స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. వర్శిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్, వైస్ చాన్సలర్ రాజశేఖర్‌తో పాటు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. సీజేఐ ఎన్వీ రమణ ఈ విశ్వవిద్యాలయం పూర్వి విద్యార్థి కావడం విశేషం. ఈ సందర్భంగా పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలతోపాటు పట్టాలను బహూకరించారు.
ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయంలో చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు. తాను చదువుకున్న యూనివర్శిటీ నుంచే గౌరవ డాక్టరేట్ పొందడం అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నానన్నారు. ఇక్కడి క్యాంటీన్ తమ అడ్డా అని, ఇక్కడ కూర్చుని ఎన్నో విషయాలపై చర్చించేవారమన్నారు. అలాంటి చర్చలు ఇప్పుడు జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు. సమస్యలపై యువత స్పందించాలని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా తయారుకావాలని సూచించారు.
గత 40 ఏండ్లుగా నాగార్జున విశ్వవిద్యాలయం విద్యా రంగానికి అందిస్తున్న సేవలు అమోఘమైనవని ప్రశంసించారు. హోలిస్టిక్ విద్యా విధానం అమలవుతేనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సమాజం కోసం, సమాజం అవసరాల కోసం ఉత్తమ పౌరుల్ని తయారుచేసేలా విద్యా విధానం ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పరిశోధనలకు పెద్ద పీఠ వేయాలని, అందుకు తగినట్లుగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. యూనివర్శిటీకి అవసరమైన నిధులు అందించేలా మంత్రి బొత్స చొరవ తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

