మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు

అమరావతి : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. అమరావతి భూములకు సంబంధించి ఆధారాలుంటే చూపాలని ఆయనకు సీఐడీ సూచించింది. అమరావతి ప్రాంతంలో ఉన్న అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి గత నెలలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషినల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుతోపాటు కొన్ని ఆధారాలను సైతం సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ డీఎస్పీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా మంగళవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఆర్పీసీ (41) కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణ నిమిత్తం విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని ఆయనకు సూచించింది. ఇదేవిషయంలో మాజీ మంత్రి నారాయణకు సైతం నోటీసులు అందినట్లు సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

