ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళల్లో మార్పులు..
కర్ఫ్యూ వేళల్లో మార్పులు| ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే శుక్రవారం నుంచి మరో రెండు గంటలు సడలింపు ఇవ్వనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే శుక్రవారం నుంచి మరో రెండు గంటలు సడలింపు ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూను సడలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే కర్ఫ్యూ సమయంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. కొత్త నిబంధనలు ఈ నెల 20వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.
మారిన బ్యాంకుల పనివేళలు
కర్ఫ్యూ సడలింపులతో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. నిన్నటి వరకు ఉదయం 9 నుంచి 12 వరకు బ్యాంకులు పనిచేశాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

