Y.S. Jagan | చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో లబ్ధి : వైఎస్ జగన్
Y.S. Jagan | ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి లబ్ధిపొందారని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ( Elections ) చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ ( Murdered Democracy ) చేసి లబ్ధిపొందారని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( Y.S. Jagan ) ఆరోపించారు. గురువారం తాడేపల్లి నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు, ఎన్నికల అధికారులు చంద్రబాబుకు తొత్తుగా మారారని విమర్శించారు.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలు, దౌర్జన్యాలు, రిగ్గింగులకు పాల్పడ్డారని విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్ వరకు వైసీపీ అభ్యర్థులను అడుగడుగునా అడ్డుకున్నారని ఆరోపించారు. 2109 ఎంపీటీసీ స్థానాల్లోనే నామినేషన్లు వేయనివ్వలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షపార్టీని పోటీ చేయలేని పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు.
ఎన్నికలను నిష్పక్షపాతంగా జరుపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేశారని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగంతో, రౌడీయిజంతో ప్రజాస్వామాన్యన్ని అన్ని రకాలుగా ఖూనీ చేశారని తెలిపారు. పోలింగ్ బూత్‌లో వైసీపీ ఏజెంట్లను కూడా కూర్చొనివ్వ లేదని జగన్ వెల్లడించారు.
రాష్ట్రంలో జరుగుతున్నది ఎన్నికలా? సెలక్షన్లా ? అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుందని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక మున్నెన్నడు లేని విధంగా ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు చంద్రబాబు ప్రభుత్వ అన్ని అడ్డదారులు తొక్కుతుందని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో లబ్ధి : వైఎస్ జగన్
ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం
Kedarnath Dham Yatra | ముగింపు దశలోనూ కేదార్ నాథ్ ధామ్‌కు తగ్గని యాత్రికులు
తిమ్మాపురంలో భూముల రీ సర్వే పరిశీలన
Damodara Rajanarasimha | టీపీసీసీ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ డుమ్మా..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

