అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ స్కీంలో స్కాంకు పాల్పడారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu ) ని అరెస్టు (Arrest ) చేసి తీసుకెళ్తున్న కాన్వాయ్‌ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. నంద్యాలలో శనివారం సీఐడీ పోలీసులు (CID Police) ఉదయం అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్తుండగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద టీడీపీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో రహదారి (National Highway) పై బైఠాయించారు.
పోలీసులు వారిని రోడ్డుపై నుంచి తొలగించేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారు. చివరకు స్వల్ప లాఠీచార్జి చేశారు. సుమారు అరగంట పాటు కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో స్వయనా చంద్రబాబు వాహనం దిగి వచ్చి దారి ఇవ్వాలని టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. దీంతో కార్యకర్తలు పకక్క తప్పుకోవడంతో అరగంట అనంతరం కాన్వాయ్ విజయవాడ వైపు బయలు దేరింది.