అమరావతి : ఏపీలోని పలు చారిత్రక నిర్మాణాలకు విశిష్ట గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని 3 చారిత్రక కట్టడాలను ఆదర్శ స్మారకాలుగా గుర్తించినట్టు కేంద్ర పర్యాటకశాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ఆదర్శ స్మారకాల జాబితాలో చేర్చింది. ఈ ఆదర్శ స్మారకాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొంది. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో కడప జిల్లా గండికోటకు స్థానం కల్పించినట్టు తెలిపింది.