మాజీ మంత్రి వివేకా ఇంటిని పరిశీలిస్తున్న సీబీఐ
మాజీ మంత్రి వివేకా | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీసి కొలతలు వేస్తున్నారు.

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీసి కొలతలు వేస్తున్నారు. నిన్న సాయంత్రం వివేకా ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మళ్లీ బుధవారం ఉదయం కూడా అధికారులు ఇంటిని పరిశీలిస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకా 2019, మార్చి 15న హత్యకు గురయ్యారు. గుర్తుతెలియన వ్యక్తులు ఆయన నివాసంలోనే కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి హతమార్చారు. అయితే ఈ హత్య అనేక అనుమానాలకు తావీయడంతో.. సీబీఐ విచారణ చేపట్టింది. దీంతో గతకొంతకాలంగా విచారణను వేగంవంతం చేసింది. ఇప్పటికే అనుమానితులను విచారించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

