మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ
కొనసాగుతున్న సీబీఐ విచారణ | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. కడప జిల్లా పులివెందులకు శుక్రవారం రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి.

అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. విచారణలో భాగంగా శుక్రవారం కడప జిల్లా పులివెందులకు రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి. పులివెందులలో వివేకానంద ఇంటిని సీబీఐ అధికారులు మరోసారి పరిశీలించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ఇంటిని సైతం అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లాలో పలువురు అనుమానితులను ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివేకా హత్య కేసులో 12 మంది అనుమానితులను ఢిల్లీ కేంద్రంగా దాదాపు 2 నెలలు విచారించిన సీబీఐ.. మలివిడతగా కడపలో విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో వివేకా ప్రధాన అనుచరులతోపాటు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ విచారించి విలువైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

