తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల (Tirumala ) లో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదోరోజు మంగళవారం మలయప్పస్వామి (Malayappa Swamy) విశ్వ సుందరి మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. రంగురంగుల పట్టు వస్త్రాలు ధరించి, మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ధరించి, పల్లకిపై కూర్చొని, శ్రీ కృష్ణ స్వామితో కలసి మోహిని నాలుగు మాడ వీధుల్లో విహరించింది.
పురాణాల ప్రకారం వేంకటేశ్వరుడు మణిపూసలు ధరించి మనోహరమైన మోహినిగా కనిపించడంతో రాక్షసులను గందరగోళంలో పడవేస్తుందని, దేవతలకు అనుకూలంగా జరిగిన ఖగోళ యుద్ధంలో విజయం సాధించిందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, ఇతర ముఖ్య అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.