తిరుపతి : తిరుపతిలోని అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో (Brahamotsavam) భాగంగా గురువారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో (Mada Streets)ఊరేగించారు.
చిన్నశేష వాహనం దర్శనమివ్వడం పాంచభౌతిక ప్రకృతికి సంకేతమని, ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుందని అర్చకులు వెల్లడించారు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరమని పేర్కొన్నారు. అదేవిధంగా నారాయణవనం(NarayanaVanam) శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మురళీ కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు.