శ్రీశైలంలో ఘనంగా ఆషాఢ బోనాలు

శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఆషాఢ బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ యోగినిమాత సేవాశ్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు క్షేత్ర గ్రామదేవతలలో ఒకరైన మహిషాశురమర్థిని అమ్మవారికి శాస్రోక్త పూజలు నిర్వహించి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. సుమారు పది సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు భక్తులు తెలిపారు.
బోనం అంటే భోజనం అని.. గ్రామం సస్యశ్యామలంగా ఉండేలా వేడుకుంటూ మనస్పూర్తిగా అమ్మవారికి నైవేద్యం సమర్పించే సాంప్రదాయమే బోనాల పండుగ అని గురుమాత శ్రీ యోగినిమాత అన్నారు. పుణ్యభూమి అయిన భారత దేశంలో గ్రామదేవతలను కొలుస్తూ ఆషాఢంలో మేళతాళాలతో డప్పు చప్పుళతో అమ్మవారికి ఇచ్చే బోనం ఎంతో పవిత్రమైనదని భక్తులకు వివరించారు. అదే విధంగా క్రిమి కీటకాల వల్ల వస్తున్న వ్యాధులు పూర్తిగా నశించిపోవాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలే గ్రామదేవతలను శాంతింపజేసే ఈ కార్యక్రమం శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల సన్నిధిలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో పాటు శ్రీశైల క్షేత్ర ప్రజలు కూడా బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ డప్పు చప్పుళ్లు మేళతాళాలతో ఆశ్రమం నుండి గ్రామదేవత ఆలయం వరకు జరిగిన ఊరేగింపులో పోతురాజు నృత్యాలలు అందరినీ ఆకట్టుకున్నాయి.


Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

