YS Sharmila | బీజేపీ ఎంపీల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ : వైఎస్ షర్మిల
YS Sharmila | కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి దృష్టిని మళ్లించడానికి బీజేపీ కొత్త నాటకం ఆడుతుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదిక ద్వారా ఆరోపించారు.
అమరావతి : కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్‌పై (Ambedkar) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి దృష్టిని మళ్లించడానికి బీజేపీ(BJP) కొత్త నాటకం ఆడుతుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ట్విట్టర్ వేదిక ద్వారా ఆరోపించారు.
అమిత్ షా (Amit Shah) రాజీనామా చేసి, క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ పార్లమెంట్ లోపలికి వెళితే బీజేపీ ఎంపీలు (BJP MPs) అడ్డుకుని పక్కకు తోయడం వారి అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఈ తోపులాటలో మల్లికార్జున ఖర్గే కిందపడిపోయారని తెలిపారు. బీజేపీ ఎంపీలు వారిలో వారే కొట్టుకుని రాహుల్ గాంధీపై ( Rahul Gandhi) నింద మోపుతున్నారని ఆరోపించారు. వారి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలుస్తోందని విమర్శించారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలు ఎప్పుడూ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఉంటాయని, అంబేద్కర్ జ్ఞాపకాలను చెరిపివేయాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల వీడియోను డిలీట్ చేయాలంటూ ‘ఎక్స్’కు కేంద్రం నోటీసులు ఇవ్వడం చూస్తుంటే వారు తప్పు చేశారని అర్థమవుతోందని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కాషాయం మూకపై పోరాటం చేస్తూనే ఉంటుందని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

