Ayyanna patrudu | స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక .. ఆఖరి దశలో అరుదైన గౌరవమని వ్యాఖ్య
Ayyanna patrudu | ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు(Ayyanna patrudu ) ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. గడువులోగా ఒకే ఒక నామినేషన్ (Nomination) రావడంతో ఏకగ్రీవం ( unanimous ) గా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు.
శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పదవి ప్రమాణ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూసానని, ఇక ఆఖరి దశలో స్పీకర్(Speaker) పదవి దక్కడం అరుదైన విషయమని అన్నారు. 1983లో రాజకీయంలోకి ప్రవేశించానని, ఈ 42 ఏళ్ల ప్రయాణంలో పలుమార్లు మంత్రి పదవులను అలంకరించానని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu), డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ , బీజేపీ నాయకులు తన పేరును సూచిస్తూ స్పీకర్ పదవికి నామినేషన్ వేయడం అభినందనీయమని అన్నారు.
నాకు గౌరవమైన పోస్టు ఇచ్చినందుకు గౌరవంగా మెలుగుతానని వెల్లడించారు. స్పీకర్ సీటులో కూర్చున తరువాత పార్టీ గుర్తుకు రావొద్దని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ తాము అందరినీ గౌరవవిస్తామని స్పష్టం చేశారు. సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తానని, అవసరమైనే వారికి శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. ప్రజలు తమకు పదవులు ఇవ్వలేదని, బాధ్యత ఇచ్చారని , ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతానని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

