AP Speaker | ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్
AP Speaker | ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్(AP Speaker) పదవికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు(Ayyannapatrudu) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు తరుఫున కూటమి నాయకులు నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawankalyan) తో పాటు మంత్రులు నారా లోకేష్, పయ్యవుల కేశవ్, అచ్చెన్నాయుడు , సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు శాసనసభ ప్రారంభం పిదప శుక్రవారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయని సభ్యులతో ప్రమాణం చేయించిన తరువాత ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది.
శాసనసభలో మెజారిటీ సభ్యులు కూటమి వారే ఉండడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. శాససనసభలో అత్యధికంగా ఎనిమిది సార్లు్ ఎమ్మెల్యేగా గెలుపొందిన అయ్యన్నపాత్రుడికి చంద్రబాబు స్పీకర్ పదవికి ఎంపిక చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

