పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ రాసలీల.. రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న సీఐ
అనకాపల్లి జిల్లా పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ అప్పారావు మహిళతో పీఎస్‌లో అశ్లీల కార్యక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. పీకల దాకా మద్యం తాగి...
అనకాపల్లి జిల్లా : ప్రజల భద్రత చూడాల్సిన పోలీసు దారి తప్పాడు. తమ వద్దకు వచ్చే మహిళల్ని గౌరవంగా చూడాల్సిన పోలీసు.. పోలీస్ స్టేషన్‌నే తన అశ్లీల కార్యక్రమాలకు అడ్డగా మార్చుకున్నాడు. స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులను పట్టించుకోకుండా.. పీఎస్‌లోనే ఓ మహిళతో రాసలీలల్లో మునిగిపోయాడు. మద్యం మత్తులో ఉండటంతో పాటు ఓ మహిళతో సదరు ఏఎస్ఐ అడ్డంగా బుక్కయ్యాడు.
అనకాపల్లి జిల్లా పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా అప్పారావు పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి ఓ మహిళతో పీఎస్‌లో అశ్లీల కార్యక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. పీకల దాకా మద్యం తాగిన ఏఎస్ఐ అప్పారావు.. రాత్రి సమయంలో ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పీఎస్‌లోనే రాసలీలలు జరిపాడు. ఇది గమనించిన స్థానికులు సీఐకి సమాచారం ఇచ్చారు. వెంటనే స్టేషన్‌కు చేరుకున్న సీఐ.. అప్పారావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహిళలను అక్కడి నుంచి పంపించివేశాడు.
మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో తనను విడిచిపెట్టాలంటూ సీఐ కాళ్లపై పడి ఏఎస్ఐ అప్పారావు వేడుకున్నాడు. మద్యం సేవించి ఉండటమే కాకుండా మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి ఇలాంటి అకృత్యానికి పాల్పడడంపై పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం అప్పారావును అనకాపల్లి దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏఎస్ఐ తీరును స్థానిక మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఏఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్ సీఐ ఉన్నతాధికారులకు నివేదించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

