కడపలో స్థాపించిన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (వైఎస్సార్ ఏఎఫ్యూ) వైస్ ఛాన్సలర్ పోస్టు భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://apsche.ap.gov.in ద్వారా 20 రోజుల్లోగా సందర్శించి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
2020 లో ఏర్పాటైన ఈ యూనివర్సిటీకి ఓఎస్డీగా ఆచార్య డీ విజయ్ కిషోర్ నియమితులయ్యారు. రెండేండ్లకుపైగా ఇంచార్జి వీసీ, ఓఎస్డీగా కొనసాగుతున్నారు. వైవీయూ ఉపకులపతి సూర్యకళావతి ఈ ఏడాది ఫిబ్రవరి 16న మాతృశాఖకు వెళ్లిపోవడంతో ఇంఛార్జి వీసీగా విజయ్కిషోర్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఏఎఫ్యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్ విడుదలైంది.
చలమారెడ్డిపల్లె వద్ద 134 ఎకరాల్లో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యూనివర్శిటీకి శాశ్వత భవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు రూ.458 కోట్ల ఖర్చుతో యూనివర్సిటీ నిర్మాణానికి జూలై 7న భూమిపూజ నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లుగా అధికారిక వర్గాల ద్వారా తెలుస్తున్నది.