YCP Letter | కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ వైసీపీ లేఖ.. ఎందుకంటే?
YCP Letter | ఏపీలోని వైసీపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈనెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది.
అమరావతి : ఏపీలోని వైసీపీ (YCP) పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ రాసింది. ఈనెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ (Fees Reimbursment,) కింద నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది.
గతంలోనే తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 5న ఫీజుపోరుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ వైసీపీ జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి (Lella Appireddy) ఈసీకి లేఖను రాశారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3,900 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. 2019-24వరకు వైసీపీ పాలనలో రెగ్యులర్‌గా ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకుందని అప్పిరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ధర్నాలు, ఆందోళనలు చేయరాదు. ఈ సందర్భంగా ఈసీకి వైసీపీ లేఖ రాస్తూ అనుమతి ఫీజుపోరుకు అనుమతివ్వాలని కోరింది. ఈసీ తీసుకునే నిర్ణయం మేరకు వైసీపీ తన షెడ్యూల్‌ను మార్చుకునే అవకాశముంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

