ఏపీలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పీ గన్నవరం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం సీఎం జగన్ పర్యటించనున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నాలుగైదు రోజులుగా ఉత్తరాదిన ఉన్న రుతుపవనాల ద్రోణి శనివారం దక్షిణం వైపు మళ్లింది. అలాగే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఫలితంగా రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో శనివారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. కాగా, పీ గన్నవరం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం సీఎం జగన్ పర్యటించనున్నారు.
కోస్తా, రాయలసీమల్లో సోమవారం పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 2, 3 రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఏలూరు జిల్లా పోలవరంలో ఆదివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం తగ్గింది. అప్పర్ కాఫర్ డ్యామ్ వద్ద 32.540 మీటర్లకు, లోయర్ కాఫర్ డ్యామ్ వద్ద 23.91 మీటర్లకు తగ్గింది. ఎగువ నుంచి దిగువకు వస్తున్న 6,71,982 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి ఆదివారం వరద ప్రవాహం తగ్గింది. దాంతో గేట్లను మూసివేశారు. మరోవైపు ఏపీ, తెలంగాణ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 882.10 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకుగానూ 199.7354 టీఎంసీలుగా నమోదైంది.
కాగా, తూర్పు గోదావరి జిల్లా పీ గన్నవరం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ మంగళవారం పర్యటించనున్నారు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. కేవలం గాలి నుంచే చూస్తున్నారని, వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం లేదని ప్రతిపక్షాల నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దాంతో ఈసారి పీ గన్నవరం పర్యటనను సీఎం జగన్ ఎంచుకున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

