AP News | విజయవాడలో కిడ్నీ రాకెట్.. కీలక ఆదేశాలిచ్చిన ఏపీ హోంమంత్రి
విజయవాడలో బయటపడ్డ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సీపీకి ఫోన్ చేసి.. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. డబ్బు ఆశచూపి కిడ్నీ కాజేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజయవాడ సీపీని హోం మంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా పెట్టాలని సూచించారు.
AP News | విజయవాడలో బయటపడ్డ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సీపీకి ఫోన్ చేసి.. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. డబ్బు ఆశచూపి కిడ్నీ కాజేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజయవాడ సీపీని హోం మంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా పెట్టాలని సూచించారు.
అసలేం జరిగిందంటే..
గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు చిన్నపాటి వ్యాపారాలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కరోనా తర్వాత ఆర్థికంగా చితికిపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి. కుటుంబాన్ని పోషించేందుకు ఆటో డ్రైవర్గా మారాడు.. కానీ గతంలో చేసిన అప్పులు మాత్రం తీర్చలేని దుస్థితిలో ఉండిపోయాడు. ఇలాంటి సమయంలోనే బాషా అనే వ్యక్తి సోషల్మీడియాలో మధుబాబుకు పరిచయమయ్యాడు. కిడ్నీ అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చాడు. తాను కూడా గతంలో అలాగే ఓ కిడ్నీ అమ్మేసుకున్నానని నమ్మబలికాడు. దీంతో మధుబాబు కూడా కిడ్నీ అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయం బాషాకు చెప్పడంతో అతను వెంకట్ అనే మరో వ్యక్తిని పరిచయం చేశాడు.
వెంకట్ ద్వారా కిడ్నీ అమ్ముకుంటే రూ.30 లక్షలు ఇస్తాడని బాషా నమ్మబలికాడు. దీంతో వెంకట్ అడిగిన వివరాలన్నీ మధుబాబు చెప్పాడు. కొద్ది నెలల పాటు నెలవారీ ఖర్చులు కూడా వెంకట్ ఇచ్చాడు. ఈ క్రమంలో గత నెల 15వ తేదీన విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి మధుబాబుకు ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాడు. దాన్ని వేరే వ్యక్తికి సెట్ చేశారు. ఆపరేషన్ తర్వాత మధు బాబుకు ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 1.10 లక్షలు మాత్రమే ఇచ్చారు. అదేంటి మిగిలిన డబ్బులు ఇవ్వాలని మధుబాబు అడగ్గా.. వెంకట్ తన నిజస్వరూపం బయటపెట్టాడు. పేషెంట్ స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్లు సంతకం చేశావు.. నీకు డబ్బులు ఎందుకివ్వాలని మధుబాబును ఎదురు ప్రశ్నించాడు. నీకు మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్ శరత్బాబు, మధ్యవర్తులపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేశాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారడంతో హోం మంత్రి స్పందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Guntur
- kidney
- Kidney Scam
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

