Chandrababu | స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
Chandrababu | స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ కోర్టు (AP High court) ఆయనకు మధ్యంతర బెయిల్ (Interim Bail) మంజూరుచేసింది.
Chandrababu | స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ కోర్టు (AP High court) ఆయనకు మధ్యంతర బెయిల్ (Interim Bail) మంజూరుచేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరుచేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. స్కిల్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్న విషయం తెలిసిందే. చంద్రబాబు తరఫున న్యాయవాది శ్రీనివాస్‌తోపాటు.. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది.
సెప్టెంబర్ 9న స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును నంద్యాలలో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఏసీబీ కోర్టు ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి చంద్రబాబు లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ వచ్చినప్పటికీ ఏసీబీ కోర్టు తిరస్కరిస్తున్నది. ఈ నేపథ్యంలో అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నేడు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. మొత్తంగా 52 రోజులపాటు రాజమండ్రి జైలులో చంద్రబాబు గడిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

