AP news | ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా.. తుది గెజిట్ విడుదల
Konaseema | కోనసిమా (Konaseema) జిల్లాను ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తుది గెజిట్‌ను విడుదల చేసింది.
అమరావతి: కోనసీమ (Konaseema) జిల్లాను ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తుది గెజిట్‌ను విడుదల చేసింది. సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కోనసిమా జిల్లా ఏప్రిల్ 4న ఉనికిలోకి వచ్చింది. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు కోనసీమ జిల్లా పేరుమార్పు విషయమై మే 18న ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది.

జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగా మారుస్తున్నామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని అందులో పేర్కొన్నది. అయితే దీనిపై అమలాపురంలో ప్రజలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడికూడా చేసిన విషయం తెలిసిందే.
కాగా, జిల్లా పేరును మారుస్తూ జూన్ 24న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తాజాగా తుది గెజిట్‌ను కూడా విడుదలచేసింది. దీంతో కోనసిమా జిల్లా ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారిపోయింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

